శక్తివంతమైన ప్రార్థన

మన ప్రభువైన యేసు క్రీస్తు మనకు పదే పదే ఇచ్చిన ఆజ్ఞ ప్రార్థించమని.

Posted November 11,2018 in Social.

Amruthavani
86 Followers 586 Views


" చేప బ్రతకాలంటే నీరు ఎంత ముఖ్యమో,
క్రైస్తవుని ఆత్మీయ జీవితానికి ప్రార్థన కూడా అంతే ముఖ్యము."*

"ప్రార్థన అంటే ప్రభువుతో మాట్లాడటం.
ఆయన సహాయం కోసం అభ్యర్థించడం.
మన జీవితాన్ని దేవుని చిత్తానికి అప్పగించడం."

సాధు సుందర్ సింగ్ గారి మాటల్లో చెప్పాలంటే....
" ప్రార్థనంటే దేవుని హత్తుకోవడం.
ప్రార్థనంటే దేవునితో సంభాషించడం.
ప్రార్థనంటే దేవుని సన్నిధిలో ఆనందించడం."

" మన ప్రభువైన యేసు క్రీస్తు మనకు పదే పదే ఇచ్చిన ఆజ్ఞ ప్రార్థించమని. అందుకే శిష్యులు ప్రార్థన నేర్పించమని ప్రభువును అడిగినారు."

ప్రార్థన పరిశుద్దతలోనికి నడిపిస్తుంది.
ప్రార్థన ప్రభు సన్నిథిలోనికి తీసుకువెళ్లుతుంది.
ప్రార్థన జీవితాన్ని బాగుచేస్తుంది.
ప్రార్థన మనిషిని ఫలింపజేస్తుంది.
ప్రార్థన మనిషిని పాపం నుండి విడిపిస్తుంది.

జాన్ బన్యన్ గారు చెప్పినట్లు....
" ప్రార్థన పాపం చేయకుండ సహాయం చేస్తుంది."
" పాపం ప్రార్థన చేయకుండ చేస్తుంది."

పరిశుద్ద గ్రంథం ప్రార్థన గురించి ఏమని చెబుతుందంటే,
" మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి." ( యాకోబు 5:16 )
"మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి." ( మత్తయి 26:41 )
ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వారందరును రక్షణపొందుదురు." (అపోస్తలుల 2:21)

కాబట్టి మనం ప్రార్థించే భక్తులుగా ఉండాలి. ఇది ఎంతో అవసరం. వాక్యానుసారం.

" ప్రార్థించకుండా నేను ఉండలేను. ప్రార్థనే నా జీవితం ప్రార్థనే నా ఊపిరి"
అన్నాడు స్మిత్ విగిల్స్ వర్త్ అనే భక్తుడు

"ప్రార్థన సర్వశక్తివంతమైనది."
ప్రార్థన నిన్ను దేవునికి దగ్గర చేస్తుంది.
ప్రార్థన నిన్ను కాపాడుతుంది
ప్రార్థన నీ కన్నీరు తుడుస్తుంది.
ప్రార్థన నిన్ను బలపరుస్తుంది.
ప్రార్థన నిన్ను స్వస్థపరుస్తుంది.

" విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును."( యాకోబు 5:15 )

" ఎందుకంటే మన ప్రార్థనే - మన ఆయుధం."

Tags: Prayer,
Amruthavani Articles