పోప్: భక్త దేవసాహయం పిళ్ళై గారిని, మరో ఆరుగురుని పునీతులుగా ప్రకటించబోతున్నారు.

03 -05 – 2021 సోమవారం నాడు, పరిశుద్ధ పోప్ ఫ్రాన్సిస్ గారు కార్డినల్స్ ఓటును ధృవీకరించి ఏడుమంది భక్తతులకు పునీతపట్టానికి సిద్ధం చేసి, పునీతపట్టం తేదీని నిర్ణీత సమయంలో ప్రకటించాలని ఆదేశాలు ఇచ్చారు.
క్రిస్టోఫర్ వెల్స్


సోమవారం నాడు వాటికన్ అపోస్టోలిక్ ప్యాలెస్ హాల్లో జరిగిన సమావేశానికి పొప్ ఫ్రాన్సిస్ గారు అధ్యక్షత వహించి ఏడుమంది భక్తతుల పునీతపట్టానికి సంబందించిన విషయాల గురించి చర్చించారు.
ఈ సమావేశంలో కార్డినల్స్ ముఖ్యా పాత్రను పోషించి ప్రాముఖ్యత కలిగినా విషయాలపై వారి సలహాలను అందించారు.
సోమవారం నాడు జరిగిన సమావేశంలో, రాబోవు వారంలో మరియు నెలలో దేవుని పరిశుద్ధ బలిపీఠానికి వేత్తబడే ఏడుమంది భక్తతుల పునీతపట్టానికి సంబందించిన కార్డినల్స్ ఓటులను పొప్ ఫ్రాన్సిస్ గారు ధృవీకరించారు. పునీతపట్టం జరిగిన తరువాత, పరిశుద్ధ జీవితం జీవించిన పుణ్య పురుషులను మరియు పుణ్య మహిళలను విశ్వ శ్రీసభ వారిని పునీతులగా గుర్తిస్తుంది.

భక్త లాజరస్ (దేవసాహయం) పిళ్ళై:
ఏడుమంది భక్తతులు పోందబోవు పునీతపట్టంలో ఒక మతసాక్షి కూడా ఉన్నారు.
దేవసాహయం అని పిలువబడే భక్త లాజరస్ గారు భారతదేశంలోని నాయర్ కులములో జన్మించిన బ్రాహ్మణుడు. 1745 లో వీరు యేసుసభకు చెందిన గురువు చే క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. దేవసాహయం పిళ్ళై క్రైస్తవుడైనప్పుడు తన పేరును లాజరస్ మార్చుకున్నారు.
ఆయన తన బోధనలో, ప్రజల మధ్య సమానత్వం ఉండాలని, ముఖ్యంగా కులమత భేదాలు ఉండరాదని బోధించటం వలనా , అగ్రకుల పెద్దలు అయన పై ద్వేషాన్ని పెంచుకున్నారు. అఁదువలనా అతని 1749 లో అరెస్టు చేశారు. దేవుని కోసం అనేకమైనా శ్రమలను, కష్టాలను భరించినా తరువాత, 1752 జనవరి 14 నాడు ఆయను కాల్చి చంపివేశారు. తన వేదమరణం వలనా దేవుని పరలోక మహిమ కిరీటాన్ని బహుమతిగా అందుకున్నారు.
భారతదేశం నుండి పునీతపట్టం పెందబోతున్నా మొట్టమొదటి సామాన్య విశ్వాసి ఈ భక్త లాజరస్ (దేవసాహయం) పిళ్ళై గారు.


భక్త చార్లెస్ డి ఫౌకాల్డ్
భక్త చార్లెస్ డి ఫౌకాల్డ్ ఒక ఫ్రెంచ్ సైనికుడు, అతను ఉత్తర ఆఫ్రికాలో విస్తృతంగా పర్యటించారు.
వాస్తవానికి భక్త చార్లెస్ గారు కాథోలిక విశ్వాసాన్ని విడిచిపెట్టిననారు. కానీ భక్త చార్లెస్ పవిత్ర భూమికి తాను తీర్థయాత్రకు వెళ్ళినపుడు దైవపిలుపుని స్వీకరించారు. అందువల్లనా అయన 28 సంవత్సరాల వయస్సులో మరలా కాథోలిక విశ్వాసాన్ని స్వీకరించారు.
అతను 43 సంవత్సరాల వయస్సులో కాథోలిక గురువుగా అభిషేకించబడినారు. తరువాత అతను అల్జీరియాలోని ఎడారికి తిరిగి వచ్చాడు, అక్కడ అతను ధ్యానం, ప్రార్థన మరియు గ్రంధాలను చదువుతూ తన యొక్క జీవితాన్ని గడిపాడు.
1 డిసెంబర్ 1916 నాడు ఒక దుండగుల గుంపు, భక్త చార్లెస్ గారిని చంపివేశారు. భక్త చార్లెస్ డి ఫౌకాల్డ్ ఒక “ఆధ్యాత్మిక కుటుంబం” ను అయన జీవిత విధానంగా అనుసరించారు అదే మనందరికీ ప్రేరణ.

వ్యవస్థాపకులు మరియు వ్యవస్థాపకురాలు
గురువులసభను స్థాపించిన ముగ్గురు గురువులు – సీజర్ డి బస్, లుయిగి మరియా పాలాజ్జోలో మరియు గియుస్టినో మరియా రస్సోలిల్లో; మరియు కన్యలసభను స్థాపించిన ఇద్దరు కన్యశ్రీలు – మరియా ఫ్రాన్సిస్కా డి గెసే మరియు మరియా డొమెనికా మాంటోవానీ – వీరి విశ్వాస ఆదర్శ జీవితం వలనా సోమవారం నాడు వాటికన్ అపోస్టోలిక్ ప్యాలెస్ హాల్లో జరిగిన సమావేశంలో కార్డినల్స్ వీరి పునీతపట్టాని ఆమోదించారు.