పోప్ ఫ్రాన్సిస్ “మయన్మార్లో” శాంతి కోసం ప్రార్థనలు చేయమని కోరుతున్నారు.

పోప్ ఫ్రాన్సిస్ గారు, విశ్వాసులు  మే  నెలలో ప్రవేశించారని  గుర్తుచేస్తూ మరియు  “ప్రార్థన మారథాన్కు ”  పై చొరవ చూపిస్తూ,  మయన్మార్‌లో శాంతి మరియు సయోధ్య కోసం ప్రార్థించమని ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నారు.

రచన: లిండా బోర్డోని:-                           

02.05.2021 ఆదివారం నాడు  పోప్ ఫ్రాన్సిస్  గారు, మే నెల మరియమాత పూజిత మాసంలో ప్రతిరోజూ పరిశుద్ధ జపమాలను జపించే సమయములో   నిత్యం  కలహాలతో బాధపడుతున్న మయన్మార్ కోసం ప్రత్యేక ప్రార్థన చేయమని విశ్వాసులను ఆహ్వానించారు.

రెజీనా కోయెలి ప్రార్థన జపించిన  తరువాత పొప్ ఫ్రాన్సిస్ గారు మాట్లాడుతూ, కరోనా   మహమ్మారి ముగింపు కోసం “ప్రార్థన మారథాన్” ఇప్పుడే ప్రారంభమైందని,   ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరియమాత  పుణ్యక్షేత్రాలు ప్రతిరోజూ పరిశుద్ధ జపమాల ప్రత్యక్ష ప్రసారంలో  పాల్గొంటున్నాయని పోప్ గారు గుర్తుచేశారు.  బర్మీస్ చర్చి తమ దేశ  శాంతి కోసం   ప్రార్థించమని మనలను ఆహ్వానించినా ఈ సందర్భం పొప్ గారి హృదయాన్ని కదిలించింది.

మయన్మార్ దేశ   భద్రతా దళాలు తమ సైనిక పాలనకు వ్యతిరేకంగా  నిరసన తెలియజేచిన  వారిఫై  పలుమారులు  కాల్పులు జరిపినందున, కనీసం ఐదుగురు మృతి చెందడంతో పొప్ గారు తమ బాధను వ్యక్తపరుస్తూ,  విజ్ఞప్తిని తెలియజేశారు. ఫిబ్రవరి 1 న సైనిక తిరుగుబాటు వలన,  దేశం సంక్షోభంలో పడింది, భద్రతా దళాలు కనీసం 759 మంది నిరసనకారులను చంపి, వేలాది మందిని అదుపులోకి తీసుకున్నాయి.

“అవసరమైనపుడు  మరియు కష్ట సమయాల్లో మనలో ప్రతి ఒక్కరూ మన  తల్లి వైపు తిరుగుతాము,” అని పోప్ అంటూ, “మే నెల  మరియమాత పూజిత మాసంలో  మయన్మార్లో బాధ్యత కలిగిన నాయకుల  ప్రతి ఒక్కరి హృదయాలతో మన పరలోక తల్లిని మాట్లాడమని  మరియతల్లిని అర్దించుదాం, అందువల్ల వారు  ధైర్యంతో  కాలుపులకు స్వస్తిచెప్పి , సయోధ్య మరియు శాంతి మార్గంలో ముందుకు సాగుతారు.”

ప్రజాస్వామ్య అనుకూల నిరసనకారులపై తిరుగుబాటు మరియు సైనిక దాడుల తరువాత మయన్మార్లో హింస చెలరేగినప్పటి నుండి, పోప్ ఫ్రాన్సిస్ దేశ నాయకులను సంభాషణలో పాల్గొనమని పదేపదే పిలుపునిచ్చారు మరియు సయోధ్య కోసం ప్రార్థించారు.